Karthika Somavaram: తొలి కార్తీక సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతోన్న శైవక్షేత్రాలు

by Y.Nagarani |   ( Updated:2024-11-04 03:53:11.0  )
Karthika Somavaram: తొలి కార్తీక సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతోన్న శైవక్షేత్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేకపూజలు చేస్తున్నారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ దీపకాంతులతో వెలిగిపోతుండగా.. శివయ్యను దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు. ఏపీలోని పంచారామ క్షేత్రాలకు (Pancharama Kshetralu) భక్తుల తాకిడి పెరిగింది. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారరామం, పశ్చిమగోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. లయకారుడిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.

వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల్లో కార్తీక సోమవారం శోభ కనిపిస్తోంది. బెజవాడ దుర్గమ్మ, మహానంది, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలతో పాటు తెలంగాణలోని యాదాద్రి ఆలయం, వేములవాడ.. వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరగడంతో ఆర్జిత సేవల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉసిరిచెట్ల వద్ద దీపారాధనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed