Wow.. అదిరిపోయిన దుర్గామాత 'లక్ష్మీదేవి' అవతారం

by GSrikanth |
Wow.. అదిరిపోయిన దుర్గామాత లక్ష్మీదేవి అవతారం
X

దిశ, బెల్లంపల్లి: దేశ వ్యాప్తంగా దేవీశన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ అనంతరం ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో భక్తులంగా అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. పూలు, నగదులో వినూత్నంగా మండపాటు ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ మండపంలో దుర్గామాత ధనలక్ష్మీ అవతారం భక్తులను ఆకట్టుకుంది. ఏకంగా రూ.51 లక్షలతో అమ్మవారిని అలంకరించారు. స్థానిక శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల నోట్లతో ఆలయ ప్రాంగణమంతా అలంకరించడంతో కొత్త శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నల్మా సంతోష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రేణిగుంట శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




Advertisement

Next Story