- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tulasi: చనిపోయిన తులసి మొక్కను తిరిగి బతికించవచ్చా?

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది. ఇప్పటికి ఎంతో మంది ఉదయం లేవగానే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపం పెడతారు. గుమ్మం ముందుకు వెళ్ళగానే ఈ మొక్క దర్శనం ఇస్తుంది. అయితే, అనుకోకుండా తులసి మొక్క చనిపోతుంటుంది. వెంటనే దానిని తీసేసి కొత్తది నాటుతారు. కొందరైతే ఇలా ఎందుకు జరిగిందని పండితులను కలసి ఏం పరిహారం చేయాలని అడుగుతుంటారు. అయితే, చనిపోయిన తులసి మొక్కను తిరిగి బతికించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ముందుగా, తులసి మొక్కకు ఉండే కొమ్మలు పచ్చిగా ఉందో లేదో చూడండి. అలాగే గింజలు మొత్తం ఎండిపోయాయేమో చెక్ చేయండి. అదే చెట్టు గింజలు పూర్తిగా ఎండిపోతే, వెంటనే వాటిని కొత్త కుండీలో వేస్తే కొత్త మొక్క వచ్చేస్తుంది. రోజుకొకసారి నీళ్లు పోస్తూ ఉండాలి. అలాగే, ఆకులు వాడిపోయినప్పుడు నీటిని పోస్తూ ఉండాలి. ఒక రెండు మగ్గులతో నీళ్లు పోస్తే మధ్యాహ్నానానికి ఆకులు చక్కగా విచ్చుకుంటాయి. ఒకవేళ మొక్క చచ్చిపోయేలా ఉందని మీకు అనిపించినప్పుడు వెంటనే నల్ల మట్టిని తీసి ఎర్రమట్టిని వేసి నీళ్లు చల్లండి.
తులసి మొక్కకు రోజుకు 6 నుంచి 8 గంటల పాటు సూర్య కిరణాలు పడుతూ ఉండాలి. అప్పుడే మొక్క ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే చాలా మంది తులసి మొక్కను పూజించేటప్పుడు దీపం వెలిగించి అగరబత్తిని కుండీలో గుచ్చిపెడుతుంటారు. ఆ పొగ ఎఫెక్ట్ మొక్కపై పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే అగరబత్తీని దూరంగా గుచ్చాలి. ఆకులు పసుపు రంగులో కనిపిస్తే వాటిని తుంచేయండి. ఇలా చేస్తే చనిపోతున్న తులసి మొక్కను తిరిగి బతికించుకోవచ్చు. తులసి మొక్కను ఎంత ఓపికగా చూసుకుంటే అంత పచ్చగా ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.