Akasha Ganga : ఆకాశగంగ తిరుమలలో ఎలా ఏర్పడిందో తెలుసా ?

by Prasanna |
Akasha Ganga : ఆకాశగంగ తిరుమలలో ఎలా ఏర్పడిందో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటికి సకల పాపాలను పారత్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్లిన వారు ఆకాశగంగ దర్శించు కొని వస్తుంటారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎలా ఏర్పడిందో ఇక్కడ చూద్దాం.

తిరుమల నంబి గారు, పాపనాశనానికి వెళ్లి అక్కడి నుంచి నీటి కుండ ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు. స్వామి వారికి నంబి తీర్ధం తీసుకెళ్తుంటే .. స్వామి వారు మరొక రూపంలో వచ్చి .. బాగా దాహంగా ఉంది.. కుసెన్నిమంచి నీళ్లు ఇవ్వమని అడగగా ..అప్పుడు నంబి ఇది స్వామి అభిషేక జలం .. మీరు అడగకూడదు.. నేను ఇవ్వకూడదని అంటాడు .. వేటగాడుగా ఉన్న స్వామి ..దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పోయాలని అంటాడు. అయినా కూడా మీరు దేవుణ్ణి ప్రార్ధించండి. ఆయనే మీ దాహం తీరుస్తాడని నంబి చెబుతాడు. నేను స్వామి వారి దగ్గరకు వెళ్లాలని పరుగున నంబి వెళ్తుండగా .. స్వామి వారు నంబి తీసుకెళ్తున్న కుండకి బాణం వేసాడు.. దానితో చిల్లు పడుతుంది .. స్వామి వారు దోసెట పట్టి నీరు త్రాగసాగారు. నీరు మొత్తం నేలపాలయ్యానని నంబి బాధతో కృంగిపోతాడు .. అది చూసిన స్వామి నివ్వెరపోయాడు..నీ జలం ఇక్కడే ఉందని .. నంబిని తీసుకోని స్వామి వారు రెండు అడుగులు వేసి.. అక్కడి నుంచి బాణంతో కొండని కొట్టాడు.. కొండ నుంచి జలధార ..పొంగుకుంటూ ఆకాశగంగగా మారింది. ఈ విధంగా "ఆకాశగంగ" అనే పేరు వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed