వింత ఆచారం.. ఆ ఊరిలో శ్రీరామనవమి రోజున చుక్క, ముక్క ఉండాల్సిందే..!

by Disha Web Desk 10 |
వింత ఆచారం.. ఆ ఊరిలో శ్రీరామనవమి రోజున చుక్క, ముక్క ఉండాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్: శ్రీరామనవమి పండుగ రోజు దేవాలయాల్లో, గ్రామాల్లో రాములోరి కల్యాణం ఘనంగా జరుపుతారు. ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. నవమి రోజున బెల్లం, పాయసం, పులిహోర వడ్డిస్తారు. ఆల్కహాల్, మాంసాహారాన్ని అసలు ముట్టకుండా నిష్టగా జరుపుకుంటాము. అయితే, ఇక్కడ శ్రీరామ నవమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు. ఆ ఊరిలో శ్రీరామ నవమి రోజున ప్రతి ఇంటిలో చుక్క, ముక్క ఉండాల్సిందే. సంప్రదాయంగా భిన్నంగా జరుపుకుకునే ఆ గ్రామం గురించి ఇక్కడ చూద్దాం..

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీరామ నవమి నాడు జరుపుకునే సీతారాముళ్ల కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగలను గ్రామస్తులు వివిధ రకాలుగా జరుపుకుంటారు శ్రీరామనవమిని మాంసాహారం విందు భోజనాలతో వేడుకలు వైభవంగా జరుపుకుంటారు.

దేవుడి కళ్యాణం అనంతరం శ్రీరామ నవమి రోజున గ్రామంలో నాన్ వెజ్ ఆనవాయితీగా వస్తోంది. నవమి రోజున మధ్యాహ్నం 01:00 వరకు సీతారాముల కల్యాణం జరుగుతుంది. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. దీని తర్వాత ఆర్థిక సామర్థ్యాలను బట్టి ఇంట్లో మేకలు, కోళ్లను వధించి నవమి వేడుకలు జరుపుకుంటారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ వందల ఏళ్లుగా మాంసాహార సంప్రదాయం ఉంది. ఇది చూసిన నెటిజెన్స్ ఏంటో ఈ మధ్య వింత ఆచారాలన్ని బయటకి వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed