బ్యాంకులకు తరలించే వాహనాల్లో పొలిటికల్ ‘మనీ’.. బయటపడ్డ భారీ స్కాం

by Disha Web Desk 4 |
బ్యాంకులకు తరలించే వాహనాల్లో పొలిటికల్ ‘మనీ’.. బయటపడ్డ భారీ స్కాం
X

దిశ, క్రైమ్ బ్యూరో : లోకసభ ఎన్నికల వేళ ఓటర్‌లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ నాయకులు నయా ఎత్తుగడ వేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విధంగా కొంత మంది హవాలా వ్యాపారులు, ఇతర వ్యాపారులు కూడా వారికి సంబంధించిన అక్రమ నగదు తరలించేందుకు కొత్త ఐడియాలతో తరలించేందుకు స్కెచ్‌లు వేస్తున్నారని పోలీస్‌లకు సమాచారం అందింది. దీంతో సేఫ్‌గా డబ్బులు తరలించేందుకు బ్యాంకులు, ఏటీఏంలకు నగదు తరలించే ఏజెన్సీలతో పాటు ఆ వాహనాల్లో ఉండే మేనేజర్‌లను అక్రమ వ్యాపారులు మచ్చిక చేసుకుంటున్నారు. దీని కోసం వారికి భారీగా కమీషన్‌లను ఎర వేస్తున్నట్లు పోలీస్‌లకు సమాచారం ఉంది.

క్యూఆర్ కోడ్ ఉండాలి..

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇలా బ్యాంకు, ఏటీఏం లకు నగదు తరలించే వారు కచ్చితంగా వారు ప్రతిరోజు ఎన్నికల సంఘం అధికారులకు ఎంత డబ్బు తరలిస్తున్నారు, రూట్, వాహనం నెంబర్, అందులో ఉండే మేనేజర్, డ్రైవర్, గన్ మెన్ వివరాలు తెలిపి క్యూఆర్ కోడ్ తీసుకోవాలి. ఈ కోడ్‌లో నమోదు చేసిన డబ్బుకు మించి డబ్బులు ఉంటే అది అక్రమంగా తరలిస్తున్న నగదుగా గుర్తిస్తారు.

స్కెచ్ ఎలా అంటే..

అయితే ఈ నగదును తరలించే వాహనాలు క్యూఆర్ కోడ్ పూర్తి చేసుకున్న తర్వాత అక్రమ వ్యాపారులు, రాజకీయ ప్రతినిధులు వాహనంలో ఉండే వారికి కమీషన్‌లను ఎర వేసి ఆ రూట్‌లో వారి స్పాట్‌లో ఈ అక్రమ నగదును తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం నిర్వహించిన తనిఖీల్లో ఇలా బ్యాంకులకు నగదు తరలించే ఆరు వాహనాల్లో క్యూఆర్ కోడ్‌కు విరుద్ధంగా రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed