- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడి మల్కాపూర్‌లో దారుణం.. ఫోన్ కోసం యువకుడి హత్య
by srinivas |

X
దిశ, కార్వాన్: ఫోన్ దొంగిలించేందుకు వెళ్లి అది కుదరక పోవడంతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సనావుల్లా (24) గుడి మల్కాపూర్ రింగ్ రోడ్డు పిల్లర్ నంబర్ 65 వద్ద మంగళవారం అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం పైవచ్చి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అది కుదరక పోవడంతో కత్తితో చాతీ, భుజంపై పొడిచి ఫోన్ లాక్కొని పారిపోయారు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story