Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర.. ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

by D.Reddy |
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర.. ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్ (Amarnath) గుహలో సహజంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తారు. ప్రతి హిందూవు తన జీవితంలో ఒక్కసారైన ఈ అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra) వెళ్లాలి అనుకుంటాడు. అయితే, సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమర్‌నాథ్ ఏడాదికి నెల నుంచి రెండు నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఈ ఏడాది ఈ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది. దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

అమర్‌నాథ్ యాత్ర ప్రతి ఏడాది ఆషాడమాసంలో ప్రారంభమై రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఇక ఈ ఏడాది జూలై 3న ఈ యాత్ర మొదలవుతుందని అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) అధికారులు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి జూలై 3న ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక ఆగస్టు 9న రక్షా బంధన్ రోజున పూర్తవుతుందని వెల్లడించారు. ఈ మేరకు అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

కాగా, మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అమర్‌నాథ్ యాత్ర సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులకు తరలి వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభంగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా కచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్‌కు అనర్హులు. ముఖ్యంగా అమర్‌నాథ్ యాత్రను ప్రారంభించే ముందు.. యాత్రికులు ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.



Next Story