Cat Temple : వింత ఆచారం.. ఇక్కడేమో పిల్లి చెడు శకునం.. కానీ అక్కడ వెయ్యేళ్లుగా పూజలు

by Prasanna |
Cat Temple : వింత ఆచారం.. ఇక్కడేమో పిల్లి చెడు శకునం.. కానీ అక్కడ వెయ్యేళ్లుగా పూజలు
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ మారుతున్నా కూడా ఇప్పటికి వింత ఆచారాలు వింటూనే ఉన్నాం. భారత దేశంలో విగ్రహాల రూపంలో దేవుడు దర్శనమిస్తుంటాడు. కొన్ని చోట్ల కుక్కలు, పాములను దేవతల్లాగా పూజిస్తుంటారు. అంతే కాకుండా, వాటి కోసం దేవాలయాలు కూడా నిర్మించారు. ఇప్పుడు మరి వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. మనం పిల్లి ఎదురైతే అశుభంగా పరిగణిస్తాము కానీ అక్కడ పిల్లి కోసం పెద్ద దేవాలయం నిర్మించి పూజలు కూడా చేస్తున్నారు. ఇది మీకు వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా కర్ణాటకలో ఇదే ఆచారాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఈ గుడిని నిర్మించారు. అక్కడి ప్రజలు వెయ్యేళ్ల నుంచి ఈ పూజలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మనకి దసరా పండుగ ఎలాగో అక్కడ పిల్లిని అంతే సంతోషంతో కొలుస్తారు. వారి దేవత మంగమ్మ తల్లి పిల్లి రూపంలోకి ప్రవేశించిందని, కొరివి దెయ్యాల నుండి వారి గ్రామాన్ని కాపాడుతుందని నమ్ముతారు.

ఇక్కడ పిల్లిని ఎవరూ గద్దించరు అంతే కాకుండా ఎవరైనా పిల్లులను కొట్టినా.. వెంబడించిన వారిని కఠినంగా శిక్షిస్తారు. పొరపాటున పిల్లి చచ్చిపోయి కనిపిస్తే మనుషులకు చేసినట్లు దహన సంస్కారాలు గౌరవంగా చేస్తుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed