500 ఏండ్ల తర్వాత ఒకే సమయంలో 2 రాజయోగాలు.. ఈ 3 రాశుల వారికి తిరుగేలేదు..

by Sumithra |   ( Updated:2024-01-11 16:25:18.0  )
500 ఏండ్ల తర్వాత ఒకే సమయంలో 2 రాజయోగాలు.. ఈ 3 రాశుల వారికి తిరుగేలేదు..
X

దిశ, పీచర్స్ : గ్రహాల సంచారంతో కొన్ని రాశుల వారికి శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అలాంటి కొన్ని అద్భుతమైన యోగాలు సుమారుగా 500 ఏండ్ల తర్వాత ఏర్పడనున్నాయి. ఇంతకీ ఆ యోగాలు ఏంటి దాని వివరాలను తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు 500 ఏండ్ల తర్వాత ఒకే సమయంలో శని, శుక్రుడిచే రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే శని శశ రాజయోగం సృష్టించగా శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని సృష్టించనున్నాయి. వీటివలన ఆయా రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

మిథునరాశి

మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మాళవ్య, శశరాజ యోగం మంచి లాభాలను అందిస్తుంది. వీరి తెలివితేటలు చాలా పనులను విజయవంతంగా పూర్తి కానిస్తారు. ఈ రాశివారికి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఈ యోగాలతో ఈ రాశి వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

తులారాశి

తులారాశి మాళవ్య, శశరాజ యోగాలతో మంచి ఫలితాలు రానున్నాయి. ఈ యోగాలతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న వివాహ చర్చలు కొనసాగి వివాహం జరుగుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. వీరు ఏ పనినైనా శ్రద్ధగా పూర్తిచేస్తారు.

కుంభ రాశి..

శశ, మాళవ్య రాజయోగం కుంభరాశి వారికి మంచి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యాపారంలో మంచి ఆదాయం ఉంటుంది. కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంది.

Advertisement

Next Story