యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న ‘దేత్తడి హారిక’ సాంగ్..

by Jakkula Samataha |
యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న ‘దేత్తడి హారిక’ సాంగ్..
X

దిశ, సినిమా : ‘దేత్తడి’ యూట్యూబ్ చానల్‌‌లో చేసిన వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన ‘దేత్తడి హారిక’ అలియాస్ అలేఖ్య.. తెలంగాణ యాసలో అదరగొడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ షోకు కూడా హాజరైన అలేఖ్యను ఇటీవలే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించగా, పలు కారణాలరీత్యా తప్పుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కెరీర్‌పైనే ఫోకస్ చేస్తూ, పలు సిరీస్‌ల్లో నటిస్తున్నానని చెప్పిన హారిక.. తాజాగా రఘు మాస్టర్‌ కొరియోగ్రఫీలో వచ్చిన ‘నీలి నీలి కన్నుల వాడే’ అనే ఫోక్ సాంగ్‌‌తో వచ్చేసింది. ఈ సాంగ్‌లో హారిక వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బి.మమత ఆలపించిన ఈ సాంగ్‌కు మానుకోట ప్రసాద్ లిరిక్స్ అందించగా, మదీన్ ఎస్ కే మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Advertisement

Next Story