డిటెల్ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ టూ-వీలర్

by Harish |   ( Updated:2021-02-14 05:49:22.0  )
డిటెల్ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ టూ-వీలర్
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కరోనా తర్వాత వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడం. ముఖ్యంగా ఈ మార్పులను అనూకూలంగా మార్చుకుంటూ ప్రభుత్వాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు డిమాండ్‌ను తీర్చేందుకు వీలైనంత తక్కువ ధరకే ఈవీలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘ఇండియా ఆటో షో-2021’లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను డిటెల్ సంస్థ ఆవిష్కరించింది.

‘డిటెల్ ఈజీ ప్లస్’ పేరుతో తీసుకొచ్చిన ఈ వాహనం ఏప్రిల్ నుంచి రోడ్లపైకి వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఈవీ ఇదని, దేశీయ రోడ్లకు అనువైనదని కంపెనీ వెల్లడించింది. ఈ టూ-వీల ఎల్లో, రెడ్, రాయల్ బ్లూ, టీ బ్లూ రంగుల్లో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ‘భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ద్వారా అనేక సంచనలనాలను తీసుకురానున్నామని, అందుకు అవసరమిన ప్రయత్నాలను ప్రారంభించామని’ డిటెల్ వ్యవస్థాపకుడు యోగేష్ భాటియా చెప్పారు. ఇటీవల కేంద్రం ఈవీలపై అవగాహన కల్పిస్తోంది. దేశీయంగా తయారయ్యే ఈవీ తయారీ కంపెనీలకు తక్కువ ధరకే విక్రయించేందుకు, రానున్న కాలంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఈ నేపథ్యంలోనె పలు కంపెనీలు ఈవీల తయారీకి ఉత్సాహంతో ముందుకొచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed