- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షణాల్లో రక్తస్రావాన్ని నిరోధించే ‘రియాక్ట్ డివైజ్’
దిశ, ఫీచర్స్ : శరీరంపై లోతైన కత్తిపోటు లేదా ఇంపాలింగ్ గాయాలైనపుడు విపరీతమైన రక్తస్రావం ఏర్పడుతుంది. ఆ గాయానికి వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో రక్తస్రావాన్ని నిరోధించి లైఫ్ సేవ్ చేసే ‘రియాక్ట్’ అనే పరికరాన్ని అభివృద్ధి చేశాడు ఇంగ్లాండ్‌లోని లాఫ్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన లాస్ట్ ఇయర్ స్టూడెంట్ జోసెఫ్ బెంట్లీ.
ప్రస్తుతం పారామెడిక్స్ రక్తస్రావాన్ని నియంత్రించడానికి ‘బ్లీడ్ కంట్రోల్ కిట్స్’ ఉపయోగిస్తున్నారు. సాధారణంగా చికిత్స చేయటానికి కష్టమైన ప్రాంతాలు అండర్ ఆర్మ్, గజ్జ, ఉదరం వంటి గాయాల విషయంలో ఈ చికిత్స పనిచేయదు. కానీ ఆయా ప్రదేశాల్లో ‘రియాక్ట్’ పరికరంతో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. ఈ పరికరంలో ‘టాంపోనేడ్’ అనే సిలికాన్ బెలూన్‌తో పాటు యాక్యుయేటర్ అని పిలిచే హ్యాండ్‌హెల్డ్ పరికరాలుంటాయి. యాక్యుయేటర్ గాయాన్ని గుర్తించిన తర్వాత అంతర్గత రక్తస్రావాన్ని నివారించడానికి బెలూన్ సాయంతో పరికరం గాయంపై నొప్పిలేకుండా ఒత్తిడికి గురిచేస్తుంది దాంతో కేవలం నిమిషం వ్యవధిలోనే రక్తస్రావం ఆగిపోతుంది.
ఈ రోజుల్లో ‘పారామెడిక్స్ బ్లీడ్ కంట్రోల్ కిట్స్ ఉపయోగిస్తున్నారు కానీ.. వాటికంటే రియాక్ట్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇంట్లో కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు వేలు కట్ అయితే క్లాత్‌తో కట్టేస్తాం. అలానే కత్తిపోట్ల సమయంలో పోలీసులు, పారా మెడిక్స్ కూడా కిట్స్‌లోని గాజ్‌తో కట్టుకడతారు. అయితే దాన్ని తొలగించే సమయంలో మళ్లీ రక్తస్రావం పెరుగుతుంది. అందువల్లే సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు, రక్తానికి అడ్డుకట్ట వేసే సులభమైన ప్రొడక్ట్ అందించాలనే ఉద్దేశంతో ‘రియాక్ట్’ రూపొందించాను.
కత్తిపోటుకు గురైన బాధితుడికి రక్తం పోకుండా వీలైనంత త్వరగా ఆపడం ప్రాధాన్యత. అయితే ఈ రియాక్ట్ చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలో ఉన్నందున ఇంకా మార్కెట్లోకి రాలేదు. పేటెంట్ కోసం అప్లయ్ చేశాను. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, మిలటరీ వాళ్లకు కూడా ఈ ప్రొడక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. వీలైనంత త్వరగా దీని సేవలు అందరూ ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను’
– జోసెఫ్ బెంట్లీ, రియాక్ట్ సృష్టికర్త