- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యతో పేదరికాన్ని జయించాలి: దుర్గాప్రసాద్
దిశ, నిజామాబాద్ రూరల్: విద్యతో పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం నిజాంబాద్ జిల్లా ధర్మారం (బి) ప్రాథమికోన్నత పాఠశాలను, డిచ్ పల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యార్థులు క్లాసు రూముల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో పాఠ్యాంశాలను పూర్తిచేసి విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, భోజన సమయంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొని, శానిటైజర్ ను విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉషశ్రీతోపాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.