రైతులపై ఉద్యమ కేసులు ఎత్తేయాలని డిమాండ్

by Shyam |
రైతులపై ఉద్యమ కేసులు ఎత్తేయాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో కేసులు ఎత్తేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ డిమాండ్​ చేసింది. నల్ల చట్టాలను వెనక్కి తీసకున్నందుగాను శనివారం ఇందిరా పార్క్ వద్ద విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తెచ్చేందుకు పోరాడాలని అఖిల భారత రైతు పోరాట సమన్వనయ కమిటీ తీర్మానించింది. ఉద్యమంలో అమరులైన రైతు బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, కన్నెగంటి రవి ఏ ఐ కె ఎస్ సీసీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య ,విస్సా కిరణ్ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పి రామకృష్ణారెడ్డి, జంగారెడ్డి , తుకారాం సిహెచ్ మురహరి, కొండల్ ,మీరా సూర్యం ,ఝాన్సీ, రమా ,ఎస్ పద్మ ,తోకల రామ్ రెడ్డి అడ్వకేట్ సునంద ,మూడు శోభన్ విద్యార్థి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story