- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాలిని కొనాల్సి వస్తోంది!
దిశ, వెబ్‌డెస్క్ : ఏదో ఒకరోజు గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అప్పట్లో పెద్దవాళ్లు అంటుండేవారు. ఇప్పుడు ఆ రోజు వచ్చేసిందనిపిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం, వైరస్‌ల కారణంగా పీల్చే గాలిని కూడా నమ్మలేని రోజులు వచ్చేశాయి. ఇప్పటికే టిన్‌లలో, సిలిండర్‌లలో తాజా గాలిని నింపి అమ్ముతున్నారు. గాలి పీల్చకుండా మనిషి బతకలేడు కాబట్టి ఇప్పుడు స్వచ్ఛమైన గాలి అనేది అత్యవసర వస్తువుగా మారే పరిస్థితి వస్తోంది. ఇలా డబ్బాలలో గాలి కొనడం ఇంకా పూర్తిస్థాయిలో ట్రెండ్‌లోకి రాలేదు. కానీ, కరోనా పాండమిక్ తర్వాత ఎయిర్ ఫిల్టర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ ఇప్పుడు వీటిని తయారుచేసే పనిలో పడ్డాయి. రానున్న రోజుల్లో వీటికి మరింత డిమాండ్ పెరగనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గదిలో ఉన్న గాలిని ఫిల్టర్ చేయడం, ప్యూరిఫై చేయడం ద్వారా ఇవి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.
ఎయిర్ ప్యూరిఫైయర్‌లు గాలిని శానిటైజ్ చేస్తాయి. గాలిలో ఉన్న కాలుష్య కారకాలు, అలెర్జెన్‌లు, ట్యాక్సిన్‌లను ఇవి ప్యూరిఫై చేస్తాయి. సాధారణంగా డిఫ్యూజర్లు, హ్యుమిడిఫైయర్లు గదిలో గాలికి కొత్త అణువులను చేర్చి సువాసనలు వచ్చేలా చేస్తే, ఈ ప్యూరిఫైయర్‌లు మాత్రం గాలిలో అణువులను గ్రహిస్తాయి. అలా గ్రహించిన అణువులను తర్వాత శుద్ధి చేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి. ఎయిర్ ఫిల్టర్‌లు మాత్రం కేవలం చెడు గాలిని ఫిల్టర్ చేస్తాయి తప్ప శుద్ధి చేయవు. మరి నిజంగా వీటి వల్ల గాలి స్వచ్ఛంగా మారుతుందా అంటే నిజమనే చెప్పాలి. దాదాపు 90 శాతం గాలిలోని కాలుష్య కణాలను ఇవి తటస్థీకరిస్తాయి. సోఫాలు, గోడలు, ఇతర గట్టి ఉపరితలాలకు అంటిపెట్టుకుని ఉన్న కాలుష్య కణాలను ఈ ఎయిర్ ఫ్యూరిఫైయర్‌లు శుద్ధి చేయలేవు. ఆస్తమా, ఎలర్జీలు ఉన్న వారు ఈరోజుల్లో తాము ఉండే గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది కదా అని ఇతర జాగ్రత్తలు తీసుకోవడం మానేయొద్దు.