- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాస్త్రవేత్తల హెచ్చరిక.. భారత్‌కు త్వరలోనే డెల్టా వేరియంట్ ముప్పు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయులకు శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇండియాకు త్వరలోనే డెల్టావేరియంట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగష్టులోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. జాగ్రత్తగా ఉండకపోయినా, ముందస్తు చర్యలు తీసుకోకపోయి అనూహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మూలంగా మానవ జీవితం అల్లకల్లోలం అయింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. పొట్టచేతపట్టుకొని ఉపాధి కోసం దేశాలు దాటిన వలస కార్మికులను మళ్లీ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితులు మళ్లీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.