- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ వాసుల కోసం ఆస్పత్రులు రిజర్వ్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రులు, కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లను ఇక్కడి స్థానికుల కోసం రిజర్వ్ చేసినట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ సర్కారు ఆస్పత్రుల్లోని 10వేల పడకలు, ఢిల్లీవాసులకే కేటాయిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ బెడ్స్ మాత్రం అందరికి అందుబాటులో ఉంటాయని, అలాగే, స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చే ప్రైవేట్ హాస్పిటళ్లూ అందరికీ సేవలందిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేస్తూనే సోమవారం నుంచి ఢిల్లీ సరిహద్దులను తెరుస్తున్నట్టు వెల్లడించారు. సరిహద్దులను తెరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్లు ఢిల్లీలోని హాస్పిటళ్లను ముంచెత్తే ప్రమాదముందని భావించి బార్డర్‌లను మూసి ఉంచే నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీవాసులకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని, కొందరు దళారులు మాత్రం బెడ్లతో బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నారని, వారిని వదిలేది లేదని ఇటీవలే పేర్కొన్నారు.