- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Facebook about suicidal behaviour.: అర్ధరాత్రి ఢిల్లీలో దారుణం.. అమెరికా నుండి ఆపిన ఫేస్ బుక్
దిశ, వెబ్‌డెస్క్: అది అర్ధరాత్రి.. సమయం 12 దాటుతోంది.. ఓ అపార్ట్మెంట్ లో ఓ వ్యక్తి వ్యక్తిగత కారణాల వలన సతమతమవుతున్నాడు. ఆ బాధలను తట్టుకోలేక చావే పరిష్కారమనుకున్నాడు. అనుకోకండి తడవుగా పదునైన కత్తి తో చేతి మణికట్టును కోసేసుకున్నాడు. రక్తం ధారాళంగా పోతోంది. చుట్టూ చీకటి.. అందరు గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరు కాపాడడానికి కూడా వీలులేదు. అయితే ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న ఫేస్ బుక్ నిర్వాహకులు కనిపెట్టారు.
వెంటనే అమెరికా నుండి ఢిల్లీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇంకేముంది కట్ చేస్తే బాధితుడి ఇంటివద్ద అంబులెన్స్.. హాస్పిటల్ లో చికిత్స. ఇదంతా సరే ఢిల్లీలో సూసైడ్ చేసుకొన్న వ్యక్తి గురించి అమెరికా లో ఉన్న ఫేస్ బుక్ ప్రతినిధులకు ఎలా తెలిసింది అనేగా డౌట్.. అదెలా అంటే.. అతడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఫేస్ బుక్ వలన ఓ నిండు ప్రాణం మిగిలిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ..
ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఫేస్ బుక్ ప్రతినిధులు తమ యూజర్ ని కాపాడాలనుకున్నారు. వెంటనే అతని లొకేషన్ ని ట్రేస్ చేశారు. అది భారతదేశంలోని ఢిల్లీ ప్రాంతాన్ని సూచించడంతో ఢిల్లీ పోలీసులకు కాల్ కలిపారు. నగరంలో ఓ చోట దారుణం జరుగుతోందంటూ సమాచారం అందించారు. సదరు వ్యక్తి పేరు ఫేస్ బుక్ ఖాతాలోని వివరాలతోపాటు ఫోన్ నంబర్ కూడా చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్ తో సహా సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా రక్తపు మడుగులో సదురు వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఇక అతని ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీయగా.. ఇటీవలే భార్యను కోల్పోయిన అతను ఆమెలేని ఎడబాటును తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. దీంతో అతనికి పోలీసులు పిల్లలు కోసమైనా బతకాలని కౌన్సిలింగ్ ఇప్పించి, చికిత్సకు ఒప్పించారు. ఒక ప్రాణాన్ని కాపాడిన ఫేస్ బుక్ ని అందరు ప్రశంసిస్తూన్నారు.
Delhi Police saves man’s life after Facebook alerts about suicide bid