- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనీల్ అంబానీకి ఊరట
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి ఊరట దక్కింది. రూ. 1200 కోట్ల రుణాల అంశంలో ఎస్‌బీఐ చేపట్టే దివాళాను ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. అంతేకాకుండా ఆస్తులను విక్రయించకుండా అనీల్ అంబానికి ఆదేశాలను జారీ చేసింది. అడాగ్ గ్రూపులోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ సంస్థలు తీసుకున్న రుణాలకు అనీల్ అంబానీ వ్యక్తిగతమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ రుణాలు కాస్త మొండి బకాయిలుగా మారడంతో దివాళా చట్టాన్ని అనుసరిస్తూ రూ. 1200 కోట్లను వసూలు చేసేందుకు ఎస్‌బీఐ నేషనల్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కాగా, అనీల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2002లో ప్రారంభించారు. అయితే, మార్కెట్లో పోటీని తట్టుకోలేక భారీగా అప్పులను మిగుల్చుకుంది.
ఇక, అనీల్ సోదరుడు ముఖేశ్ అంబానీ 2016లో జియో సంచలనంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా స్థాయికి దిగజారింది. డిఫెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లోనూ అనీల్ అంబానీ కంపెనీలు నిలదొక్కుకోలేకపోయాయి. రుణాల చెల్లింపులు డీఫాల్ట్ అవడంతో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ రుణాలను 2016 నుంచి నిరర్ధక ఆస్తులుగా ఎస్‌బీఐ ప్రకటించింది.