- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి మృతి.. విషాదంలో నిర్మల్ జిల్లా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కోవై వేణుగోపాల్ కరోనాతో మృతి చెందారు. నిర్మల్ జిల్లా సొన్ గ్రామానికి చెందిన న్యాయమూర్తి వేణుగోపాల్ నెల 12 కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆదివారం అనారోగ్యంతో ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
సొన్ గ్రామంలో జన్మించిన వేణు గోపాల్ హైదరాబాద్ లో న్యాయవిద్యాను చదివి 2004 నుంచి నిజామాబాద్ కోర్టుల్లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అనంతరం డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎంపిక పరీక్షలో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించిన వేణు గోపాల్ ఢిల్లీలో జడ్జిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, 12 ఏళ్ల కూతురు ఉంది. వేణుగోపాల్ మృతితో నిర్మల్, నిజామాబాద్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే న్యాయ నిపుణుడు గా పేరుతెచ్చుకున్న వేణు గోపాల్ మరణం న్యాయ రంగానికే తీరని లోటు అని న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు.