సెల్యూట్ సార్.. అంత్యక్రియల కోసం కూతురి పెళ్లి వాయిదా.!

by Anukaran |
సెల్యూట్ సార్.. అంత్యక్రియల కోసం కూతురి పెళ్లి వాయిదా.!
X

దిశ, ఫీచర్స్ : ఎంత గొప్పగా బతికినవారైనా కొవిడ్ కారణంగా చనిపోతే సొంత మనుషుల చేతి స్పర్శకు కూడా నోచుకోవడం లేదు. అంత్యక్రియలకు రక్త సంబంధీకులు, ప్రాణ స్నేహితులు సైతం దూరమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కోట్ల రూపాయలు కూడా కాటిదాకా తోడు వచ్చే నలుగురిని సంపాదించి పెట్టలేకపోతున్నాయి. శ్మశాన వాటికల వద్ద లైన్‌లో వెయిట్ చేయాల్సిన పరిణామాలు బతికున్నవారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్స్‌ కనిపిస్తుండగా.. ఈ ఆపత్కాలంలోనూ మానవత్వం పరిమళిస్తోంది. సాటి మనిషి వేదనకు ఓదార్పునిస్తూ.. ఆత్మీయుల అంత్యక్రియలకు సాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని శ్మశాన వాటిక వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్.. తన కూతురి పెళ్లిని వాయిదా వేసి, కష్టకాలంలో కొవిడ్ మృతులకు దగ్గరుండి మరీ అంత్యక్రియలకు జరిపిస్తున్నాడు.

సెకండ్ వేవ్‌లో భారత్‌లో మరణాల సంఖ్య పెరగడంతో శ్మశాన వాటికల వద్ధ వెయిట్ చేయాల్సి వస్తోంది. అక్కడి సిబ్బంది కూడా పనిభారాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో లోధి రోడ్‌లోని క్రెమటోరియం వద్ద ఏప్రిల్ 13 నుంచి డ్యూటీ చేస్తున్న ఏఎస్‌ఐ రాకేశ్ కుమార్.. ఇప్పటి వరకు 1100 మంది బాధిత కుటుంబాలకు సాయం చేశాడు. ఈ మేరకు తన కూతురి పెళ్లిని కూడా వాయిదా వేసిన కుమార్.. ‘ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి వేడుక గురించి ఎలా ఆలోచిస్తాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని.. మనం ఇతరులకు హెల్ప్ చేస్తేనే, దేవుడు మనపై దయ చూపిస్తాడని చెప్తున్నాడు. ఈ 56 ఏళ్ల ఏఎస్‌ఐ ప్రస్తుతం హజ్రత్ నిజాముద్దీన్ వద్ద పోస్టింగ్‌లో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed