- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సులో బడి.. ఉచిత విద్య, ఆహారం!
దిశ, ఫీచర్స్: మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ విద్యను యాక్సెస్ చేయలేని పిల్లలకు ఢిల్లీలోని ‘హోప్’ అనే కమ్యూనిటీ స్కూల్ సహాయపడుతుంది. ఇది మొబైల్ తరగతి గదుల ద్వారా వెనుకబడిన పిల్లలు చదువు నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తోంది.
‘తేజస్ ఆసియా’ అనే ఎన్‌జీవో ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. ఈ మేరకు బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లను తయారుచేయగా.. ప్రస్తుతం నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు.. ఆహారం, స్లేట్‌లు, కలరింగ్ పెన్నులతో పాటు అవసరమైన పుస్తకాలు కూడా సమకూరుస్తారు. తర్వాత ప్రాథమిక విద్యా నైపుణ్యాలను నేర్పిస్తూ పిల్లల్ల సామర్థ్యాన్నిబట్టి సదరు విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. ఇక లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో చాలామంది హోప్ బస్సుల్లో చదువుకోవడానికి వచ్చారని, దీంతో విద్యార్థులు, బస్సుల సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.
‘హోప్ బస్సుల ద్వారా ప్రత్యేకంగా ఒక అండర్ సర్వడ్ కమ్యూనిటీలోని ప్రదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వారు బడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో పాఠశాలనే విద్యార్థుల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ‘హోప్ బస్సులు వారి జీవితాల్లో నిజమైన హోప్‌ను కలిగిస్తున్నాయని నమ్ముతున్నాను’ అని హోప్ వ్యవస్థాపకుడు మార్లో ఫిలిప్ తెలిపాడు.