సీబీఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలి- కేంద్రానికి ఢిల్లీ సీఎం వినతి

by vinod kumar |   ( Updated:2021-04-13 05:23:28.0  )
సీబీఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలి- కేంద్రానికి ఢిల్లీ సీఎం వినతి
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నందున ఎగ్జామ్స్ రద్దు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)కు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతూ భారీగా కేసులు నమోదవుతున్నాయని, గడిచిన 24 గంటల్లోనే 13,500 కొత్త కేసులు నమోదయ్యాయని వివరించారు. మరణాలూ పెరుగుతున్నాయని చెప్పారు. ‘సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్ష రాయాల్సి ఉన్నది. ఇందులో దాదాపు ఒక లక్ష మంది టీచర్లు ప్రమేయముండనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్లే హాట్‌స్పాట్లు అయ్యే ముప్పు ఉన్నది. పిల్లల ఆరోగ్యం తమకు అత్యంత ప్రధానం. అందుకే ఈ పరీక్షలు రద్దు చేయాలని సీబీఎస్‌ఈకి చేతులెత్తి మొక్కుతూ అభ్యర్థిస్తున్నాను. అసెస్‌మెంట్ కోసం ఇతర పద్ధతులను ఎంచుకోవడం మంచిది. సెకండ్ వేవ్ కారణంగా చాలా దేశాలు పరీక్షలను రద్దు చేశాయి. మనదేశంలోనూ పలు రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. సీబీఎస్ఈ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరుతున్నాను’ అని వివరించారు.

Advertisement

Next Story