- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BREAKING: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా కలకలం.. అక్షర్‌పటేల్‌కు కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో 90వేలకు పైగా కేసులు నమోదవుతుండటం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తుండటంతో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ వాయిదా పడుతుందా? అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు, స్టార్ స్పిన్నర్ అక్షర్‌పటేల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆ జట్టులో కలకలం రేపుతోంది. ఈ నెల 28న జట్టుతో చేరినప్పుడు కరోనా టెస్టు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ ఇవాళ రెండోసారి టెస్టు నిర్వహించగా అక్షర్‌పటేల్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాల్లో కలకలం రేగుతోంది.
అక్షర్‌పటేల్‌ను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే డీసీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అక్షర్‌పటేల్ కూడా కరోనా వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది.