కరోనా ఎఫెక్ట్.. ఆలస్యంగా జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం

by Shyam |
కరోనా ఎఫెక్ట్.. ఆలస్యంగా జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనామహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ విజృంభిస్తోంది. కాగా ఈ వైరస్ మూలంగా ఇప్పటికే జరగాల్సిన అన్ని అంతర్జాతీయ క్రీడలు రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈసారి ఆలస్యం కావొచ్చని క్రీడా మంత్రిత్వశాఖ అధికారి గురువారం తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రెండు నెలలు ఆలస్యం కావొచ్చన్నారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే సూచనల తర్వాతే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్, ఇతర జాతీయ క్రీడా పురస్కరాలను ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. హాకీ లెజెండ్‌, మేజర్ థాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం మహమ్మారి కారణంగా ఆలస్యం కావచ్చొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అవార్డుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి గడువును పొడిగించారు. సెల్ఫ్ నామినేషన్ ఫలితంగా అవార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్క్రీనింగ్‌ను క్రీడా మంత్రిత్వశాఖ ఇంకా ప్రారంభించలేదు. దీంతో ఆలస్యం అనివార్యం అని తెలుస్తోంది. ఈ సంవత్సరం క్రీడా అవార్డులు అందజేయడం ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed