శరీరంపై బట్టలు తీయకుండా.. గ్లౌవ్‌తో బాడీని తాకితే లైంగిక వేధింపు కాదా.?

by Anukaran |
శరీరంపై బట్టలు తీయకుండా.. గ్లౌవ్‌తో బాడీని తాకితే లైంగిక వేధింపు కాదా.?
X

దిశ, ఫీచర్స్ : చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు, నాగ్‌పూర్ బెంచ్ జనవరిలో ఇచ్చిన తీర్పుపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం నిందితుడు.. బాలిక డ్రెస్‌పై నుంచి బ్రెస్ట్‌ను తాకడాన్ని లైంగిక వేధింపుగా భావించలేమన్న హైకోర్టు తీర్పును తాజాగా సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. పోక్సో చట్టం కింద పిల్లలపై లైంగిక వేధింపుల నేరాన్ని నిర్వచించే నిబంధనను ‘బాధితుడి కోణం’ నుండి చూడాలని, ‘లైంగిక ఉద్దేశం’ ఉందని తెలిస్తే ‘స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్’ లేకున్నా నేరం చేసినట్లేనని జస్టిస్ యుయు నేతృత్వంలోని సుప్రీం బెంచ్ గురువారం వెల్లడించింది. ‘స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్’ ఉంటేనే నేరాన్ని నిర్దేశించగలమనే వ్యాఖ్యలు ప్రమాదకరమని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

నిబంధన ఏం చెబుతోంది.?

‘ఎవరైనా సరే లైంగిక ఉద్దేశంతో.. యోని, పురుషాంగం, పాయువు లేదా శిశువు చాతిని తాకినా లేదా సదరు వ్యక్తి, ఇతర ఏ వ్యక్తి అయినా చైల్డ్‌తో తమ యోని, పురుషాంగం, పాయువు లేదా చాతిని తాకేలా చేసినా లేదా అలాంటి లైంగిక ఉద్దేశ్యం కలిగిన ఏ చర్య అయినా శారీరక సంబంధాన్ని కలిగి ఉంటేనే లైంగిక వేధింపుగా భావిస్తారు. కాగా పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి సంబంధించి ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ ఒక మూలవస్తువుగా వ్యక్తీకరించబడదని, ఈ చట్టం పిల్లలపై లైంగిక నేరాలను నిరోధించడానికి ఉద్దేశించిందన్న హైకోర్టు న్యాయమూర్తికి దాని సున్నితత్వం తెలియలేదని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ వాదించారు. గతేడాది పోక్సో చట్టం కింద 43,000 నేరాలు నమోదయ్యాయని, పోక్సోకు సంబంధించినంత వరకు ఇది అత్యంత దారుణమైన తీర్పు అని వేణుగోపాల్ గతంలోనే సుప్రీంకోర్టుకు చెప్పారు.

సర్జికల్ గ్లోవ్ ధరించి అలా చేయొచ్చా.?

నేరంగా పరిగణించాలంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవసరమని న్యాయమూర్తి అన్నారు. అంటే ఎవరైనా సర్జికల్ గ్లోవ్ ధరించి పిల్లలలను దోపిడీ చేసి ఫ్రీగా తప్పించుకోవచ్చా? అని ప్రశ్నించాడు. నిందితుడు సల్వార్‌ను కిందకు దించడానికి ప్రయత్నించినా బెయిల్ మంజూరు చేయబడిందని, లైంగిక వేధింపులను ఈ విధంగా నిర్వచించిన మహారాష్ట్ర న్యాయాధికారులకు ప్రశంసించాలేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు వేణు గోపాల్. అతడి వాదనల తర్వాత బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జనవరి 19 తీర్పుపై సుప్రీం కోర్టు జనవరి 27న స్టే విధించింది.

వివాదం..

సదరు వ్యక్తి బాలిక బట్టలు తీయకుండానే శరీరాన్ని తాకినందున ఆ నేరాన్ని లైంగిక వేధింపుగా పేర్కొనలేమన్న బాంబే హైకోర్టు.. ఇది ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ‘ఉమెన్ మాడెస్టీ’ని ఉల్లంఘించే నేరమని తెలిపింది. కాగా గతంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 39 ఏళ్ల వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను సవరించిన హైకోర్టు.. కేవలం చేతులతో తడమడం లైంగిక వేధింపుల కిందకు రాదని చెప్పింది.

న్యాయమూర్తి, జస్టిస్ పుష్ప వీరేంద్ర గనెడివాలా, బొంబాయి హైకోర్టులో అదనపు న్యాయమూర్తి కూడా ఇదే విధమైన వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసినట్లు తరువాత తెలిసింది. ఇంకొక కేసులో.. నిందితుడు మైనర్ చేతులు పట్టుకోవడం లేదా ప్యాంటు జిప్‌ను పర్టిక్యులర్ టైమ్‌లో తెరిచి ఉంచడం, పోక్సో చట్టం సెక్షన్ 7 ప్రకారం నిర్వచించబడిన లైంగిక వేధింపులకు సంబంధించినది కాదని చెప్పి వదిలేశారు. మరొక కేసులో.. జస్టిస్ గనేడివాలా రేప్‌కు గురైన ఫిర్యాదుదారు వాంగ్మూలం ఈ కోర్టు విశ్వాసాన్ని ప్రేరేపించలేదని పేర్కొంటూ POCSO నిందితుడి శిక్షను రద్దు చేసింది.

Advertisement

Next Story

Most Viewed