- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీతో బ్రేకప్ మనశ్శాంతిని ఇచ్చింది : దీపికా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ .. ఆ స్మైల్‌కు పడిపోవచ్చు. తొలి చూపులోనే ఆ అందానికి ఫిదా అయిపోవచ్చు. అంతటి అందం ఉన్న దీపికా… అందానికి అభినయాన్ని జోడించి బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. సినీ జీవితంలో ఎప్పుడూ విజయతీరాలనే చేరుతున్న ఆమె… తన వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా మోసపోయానని చెప్పింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా ఒక వ్యక్తితో అనుబంధం, ఆ బంధంపై ఉన్న నమ్మకం గురించి మాట్లాడింది. రణ్‌వీర్ సింగ్ తన లైఫ్‌లోకి రాక ముందు .. ప్రేమ పేరుతో చాలా మోసపోయానని చెప్పింది. నా వరకు ఒక వ్యక్తితో శారీరకంగా ఒకటయ్యామంటే అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయని చెప్పింది. నేను ప్రేమలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరగడాలు, నన్ను నమ్మిన వ్యక్తిని మోసం చేయడం లాంటివి చేయలేదని చెప్పింది. కాని తన మాజీ లవర్ మాత్రం అదే చేశాడంది. ఈ విషయంలో చాలా సార్లు తనని ఫూల్ చేశాడని చెప్పుకొచ్చింది. అయినా కూడా తను మారుతానని రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్లీ చాన్స్ ఇచ్చానని.. కానీ దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడని తెలిపింది. అతను వేరొకరితో క్లోజ్‌గా మూవ్ అయినప్పుడు నేనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పింది. వెంటనే ఆ బంధానికి స్వస్తి పలికానని తెలిపింది.
ఒక్కసారి తను తప్పు చేశాడంటే అందులో ఎంతో కొంత నా తప్పు కూడా ఉంటుందని భావించాను అన్న దీపికా.. కానీ పదే పదే ఆ తప్పు చేశాడంటే అతనే తప్పుడు మనిషని అర్ధం చేసుకున్నానని చెప్పింది. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఇచ్చానని.. ఎన్నడు ఏదీ ఆశించలేదని తెలిపింది. కానీ తనకు ఎప్పుడు నమ్మకద్రోహం చేస్తూనే ఉండడంతో అతనిపై గౌరవం పోయిందని.. అలాంటప్పుడు అతనితో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడమే మంచిదని బ్రేకప్ చెప్పేసినట్లు తెలిపింది. ఏ బంధంలోనైనా బాధ్యత, నమ్మకం చాలా ముఖ్యమని తెలిపింది దీపికా. ఇన్ని విషయాలు చెప్పిన దీపికా తన మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయినా తన గురించే చెప్పిందని అర్ధం చేసుకోవచ్చు. తనతో రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణ్‌బీర్ .. వెంటనే కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేసి.. అక్కడ కూడా బ్రేకప్ చెప్పేసి కొత్తగా అలియా భట్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు.
tags : Deepika Padukone, Ranbir Kapoor, Ranveer Singh