సరదా అంటూనే నెట్ ప్రాక్టీస్‌లో దీపక్ చాహర్ విశ్వరూపం (వీడియో)

by Shyam |
సరదా అంటూనే నెట్ ప్రాక్టీస్‌లో దీపక్ చాహర్ విశ్వరూపం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా టూర్‌ కోసం స్టాండ్‌బై బౌలర్‌గా ఎంపికైన దీపక్ చాహర్‌ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఒకే జట్టులో ఉన్న బౌలర్ బ్యాట్స్‌మాన్‌లను ఇబ్బంది పెట్టడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అదేం లేదండీ..! డిసెంబర్ 26 నుంచి సఫారీలతో టీమిండియా టెస్టు మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెడ్‌ బాల్‌తో స్వింగ్‌‌‌‌ చేశాడు దీపక్ చాహర్. అద్భుతమైన డెలివరీలు చేస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వృద్ధిమాన్ సాహా, ప్రియాంక్ పంచల్‌ను కాస్త ఇబ్బంది పెట్టాడు. అతడి బౌలింగ్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌ పోస్ట్ చేస్తూ.. ఎరుపు బంతితో సరదాగా ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంతే ఈ వీడియో చూసిన ఆయన ఫాలోవర్లు భువీ తర్వాత పదునైన స్వింగ్ బంతులను సంధించేది దీపక్ చాహర్ అంటూ కొనియాడుతున్నారు.

Advertisement

Next Story