- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ 19 స్కామ్‌లు.. గూగుల్ సూచనలు
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి వినియోగదారులను రక్షణ కల్పించడానికి గూగుల్ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఆవిష్కరించింది. ఇందులో ముఖ్యంగా కొవిడ్ 19కి సంబంధించిన ఆన్‌లైన్ మోసాల మీద దృష్టిసారించింది. ఈ పేరుతో వ్యక్తిగత డేటాను, నకిలీ ఆఫర్లను, విరాళాలను తస్కరించే స్కామ్‌ల గురించి తెలియజేసింది. వీటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సూచనలను కూడా ఈ పోర్టల్‌లో పేర్కొంది.
1. నమ్మదగిన వాటి కోసమే చూడండి: విశ్వసనీయ వెబ్‌సైట్లైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సైట్లు చెప్పే సమాచారాన్ని నమ్మమని గూగుల్ చెప్పింది.
2. వ్యక్తిగత, ఆర్థిక సమచారం : పేరు, చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్, క్రెడిట్ కార్డు వంటి బ్యాంకు వివరాలను అడిగే ఈమెయిళ్లను నమ్మకండి. ఈ ఈమెయిళ్లు ఆన్‌లైన్‌లో డబ్బు లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి.
3. విరాళాలు : కొవిడ్ 19 ప్రభావాల కారణంగా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి సాయం చేయాలనుకోవడం కరక్టే. కానీ ఆ ప్రయత్నంలో మీరు మోసపోకుండా ఉండటానికి విరాళం అడుగుతున్న వారి గురించి ముందు తెలుసుకుని సురక్షిత మార్గం ద్వారా మాత్రమే డబ్బు చెల్లించాలని గూగుల్ సూచిస్తోంది.
4. లింక్స్ : కొవిడ్ 19 సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేయొద్దని గూగుల్ హెచ్చరిస్తోంది. ఓపెన్ చేయడానికి ముందు లింక్ పేరును, సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకొని నొక్కాలి. వీటితో పాటు వినియోగదారులు అందరూ రెండు దశల వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలని గూగుల్ సలహా ఇచ్చింది.
Tags – corona, covid 19, google, verification, security, donations, fraud, scams