వారెవ్వా.. ఇందూరులో కరోనా కట్టడి ఇలా!

by Shyam |
వారెవ్వా.. ఇందూరులో కరోనా కట్టడి ఇలా!
X

దిశ, నిజామాబాద్: ఇందూరు జిల్లా అధికారుల కృషిని చూస్తే వారెవ్వా అనక తప్పదు. అధికార యంత్రాంగం చర్యలతో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. 6 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో కరోనా ఫ్రీ జిల్లా దిశగా అడుగులు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో సైతం 10 రోజులుగా కేసుల జాడ లేకపోవడంతో గ్రీన్‌జోన్‌‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మార్చి 23 వరకు సాధారణ పరిస్థితులే ఉన్నా.. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలింది. జిల్లాలో అదే తొలి కరోనా కేసు. అప్పటి నుంచి కేసులు పెరుగుతూ 61కి చేరడంతో స్టేట్‌లో ఎక్కువ కేసులు నమోదైన రెండో జిల్లాగా మారింది. వెంటనే చర్యలను వేగవంతం చేసిన అధికార యంత్రాంగం… 1,096 మందిని క్వారంటైన్‌కు పంపి, విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ 43వేల ఇళ్లలో సర్వే చేసి చేసింది. 26 క్లస్టర్‌లుగా గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.

ర్యాండమ్ టెస్టులకు రంగం సిద్ధం

ఆరెంజ్ జోన్‌లో ఉన్నా కామారెడ్డి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కోలుకోగా, నలుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో నాలుగు ఐసోలేషన్ కేంద్రాలు, 4 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి 224 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆరోగ్య శాఖ 15 వేల ఇళ్లలో సర్వే చేసింది. పోలీసులు తనిఖీలు చేసి 7 వేల వాహనాలను సీజ్ చేశారు. ఇదే క్రమంలో కరోనాను పూర్తిస్థాయిలో నివారించేందుకు ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ టెస్టులకు ఐసీఎంఆర్ సీనియర్ శాస్ర్తవేత్తతోపాటు రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్ రానున్నారు. సేకరంచిన నమూనాల ఫలితాలను 15 నిమిషాల్లో తేల్చనున్నారు.

tags: Corona Virus, Positive, Lockdown, Nizamabad, Random Tests, Orange Zone, Kamareddy, Quarantine

Advertisement

Next Story

Most Viewed