- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2002 వరకు అప్పులే కట్టా.. కన్నీటి పర్యంతమైన రోజా
దిశ, ఏపీ బ్యూరో: సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ ఎమ్మెల్యే రోజా స్టైలే సెపరేటు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. ఇక అసెంబ్లీలో రోజా వేసే పంచ్‌డైలాగులు సైతం నవ్వులు పూయిస్తాయి. ఇక జబర్దస్త్ జడ్జిగా కూడా రోజా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ షోకు రోజా నవ్వే పెద్ద అసెట్ అంటూ ఉంటారు. ఒకప్పుడు నవ్వులకే పరిమితమైన రోజా రాను రాను స్క్రిప్ట్‌లో నటుల కంటే ముందే డైలాగులు చెప్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నారు.
అలాంటి రోజా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాదు ఆమె ఏడుపు చూసిన అభిమానులను సైతం కంటతడిపెట్టించారు. వివరాల్లోకి వెళ్తే వినాయకచవితి సందర్భంగా ఓ టీవీ స్పెషల్ షో నిర్వహిస్తోంది. ఆ షోకు సంబంధించి ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోలో రోజా భావోద్వేగానికి గురైంది. సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పటి నుంచి తనకు పిల్లలు పుట్టేవరకు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుకు చేసుకుంటూ రోజా కంటతడి పెట్టారు.
తాను 1991లో సినీ పరిశ్రమలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. 2002 వరకు కష్టపడి సంపాదించిన మొత్తాన్ని అప్పులకే కట్టానని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకునే ముందు తనకు ఆరోగ్య సమస్య ఉండేదని, తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని వివరించారు. అయితే పెళ్లైన తర్వాత గర్భవతి అయ్యానని…ఏడాదికే అన్షు పుట్టిందని చెప్పుకొచ్చారు. అందుకే తన కుమార్తె అన్షు అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు.
- Tags
- jaberdasth