- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెగిన పేగుబంధం.. 7 నెలలకే పుట్టిన కవలలు మృతి
దిశ, కామారెడ్డి: తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉండాల్సిన బిడ్డలు 7 నెలలు మాత్రమే ఉన్నారు. 7 నెలలకే బయట ప్రపంచంలోకి వచ్చారు ఆ కవలలు. ఇద్దరు ఆడపిల్లలే అయినా ఆ తల్లిదండ్రులు శోకించలేదు. దేవుడిచ్చిన వరంగా భావించారు. కానీ, ఏడు నెలలకే జన్మించడంతో ఆ చిన్నారుల అవయవాలు పూర్తిస్థాయిలో కుదుటపడలేదు. పైగా ఒకరు 800 గ్రాములు, మరొకరు 900 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గత నెల 8 న జన్మించిన ఆ చిన్నారులను మరుసటి రోజునే హైదరాబాదులోని సురక్ష ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు రెండు నెలల పాటు చికిత్స నిర్వహించాలని, దానికి సుమారు 14 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
దీంతో తమ పిల్లల కన్నా ఏదీ ఎక్కువ కాదని డబ్బుల కోసం ప్రయత్నించారు. సుమారు నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. తర్వాత తమతో కాకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూడగా ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి లింక్ ద్వారా విరాళాలు సేకరించడంతో చికిత్స కొనసాగింది. కానీ విధి వారిని వంచించింది. 15 రోజుల క్రితం పెద్దమ్మాయి మృతి చెందింది. అయినా తమకు ఒక్క కూతురు మాత్రమే జన్మించిందనుకుని ఆశతో ఆ పాపను బ్రతికించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు. చివరికి గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ చిన్నమ్మాయి కూడా ఆస్పత్రిలో మృతి చెందింది. దాంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. భగవంతుడు తమకు పిల్లల్ని ఇచ్చినట్టే ఇచ్చి తన వద్దకు తీసుకున్నాడని రోదించారు. ఇద్దరు కవలల మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.