ఐపీఎల్ విఫలమైతే ధోనికి కష్టమే: డీన్ జోన్స్

by Shyam |
ఐపీఎల్ విఫలమైతే ధోనికి కష్టమే: డీన్ జోన్స్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాజీ కెప్టెన్ ధోనీ విఫలమైతే తిరిగి టీమ్‌ ఇండియా లోనికి రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా తిరిగి జట్టులో స్థానం సంపాదించాలని ధోనీ భావిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం చాలా పోటీ ఉన్నట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుత పోటీని పరిశీలిస్తే సెలెక్టర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహల్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌లో ధోనీ చెలరేగి ఆడితే తప్ప అతడికి పునరాగమన అవకాశాలు ఉండవు. విఫలమైతే టీమ్‌ఇండియా తలుపులు మూసుకుపోయినట్లే. కాగా, ధోనీకి చాలా విరామం వచ్చింది. వయసు పెరిగే కొద్దీ విరామం తీసుకుని రాణించడం చాలా కష్టం’ అని డీన్ జోన్స్ అన్నాడు.భారత జట్టులో ధోనీ లేకపోతే అద్భుతమైన ఫినిషర్‌ను కోల్పోయినట్లే, అందుకే హార్దిక్ పాండ్యాను ఫినిషర్‌గా తయారు చేయడం ఉత్తమమన్నాడు.

Advertisement

Next Story