- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుపేదలకు చేయూతనందించిన బధిరులు
దిశ, కరీంనగర్:
విధిరాతతో దివ్యాంగులే అయినా వారిలో సేవాభావం మాత్రం తక్కువేమీ లేదు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై తిండి గింజలు దొరకని అభాగ్యులను ఆదుకునేందుకు వారు ముందుకు వచ్చారు. నిరుపేదలను ఆదుకోవాలని సీపీ వీబీ కమలాసన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందించి రూ. 40 వేలను బధిరులు జమ చేశారు. 9 రకాల వస్తువులతో కూడిన ప్యాక్ ను ఒక్కో కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా బధిర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి చేదోడుగా నిలవాలని భావించి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సీపీ కమలాసన్ రెడ్డి పిలుపు మేరకు తాము డబ్బు పోగు చేసి టూ టౌన్ సీఐ దేవారెడ్డిని కలవగా పీసీ జ్ఞానేశ్వర్ ను అప్పగించారని, తాము జమ చేసిన డబ్బులతో హోల్ సేల్ వ్యాపారులతో మాట్లాడి నిత్యావసరాలు తక్కువ ధరకు ఇప్పించారన్నారు. వీరి చొరవ కారణంగానే 120 కుటుంబాలకు సాయం అందించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బధిర సంఘ ప్రతినితులు నిజాం, అనిల్ కుమార్, బద్దం లక్ష్మా రెడ్డి, జనమంచి సంపత్, చంద్రలు పాల్గొన్నారు.