- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dead Sea గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.. ఈ నీటిలో తేలొచ్చు.. కానీ..!
దిశ, వెబ్‌డెస్క్ : సముద్రం అంటే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద అలలు. అందులో ఉండే రకరకాల చేపలు, తాబేళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాటితో పాటు ఆకాశంలో ఎగిరే రకరకాల పక్షులు, చుట్టూ మొక్కలు. కానీ, ఇప్పుడు మీరు తెలుసుకునే సముద్రంలో మాత్రం అలాంటివి ఏమీ ఉండవు. అంతేకాకుండా ఈ సముద్రంలో మీరు ఈత కొట్టకుండా నీటిపై తేలుతూ ఉండగలరు. ఈ సముద్రం ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ సరిహద్దుల మధ్య ఉంది. అందులో ఉండే కోబాల్ట్-బ్లూ నీరు వల్ల చుట్టుపక్కల పక్షులు, చేపలు ముఖ్యంగా మొక్కలు అలాంటివి ఏవి ఇక్కడ బతకలేవు.. అందుకే దీన్ని ‘డెడ్ సీ’ (Dead sea) అని పిలుస్తారు. దీన్ని సాల్ట్ సీ, సీ ఆఫ్ లాట్ అని కూడా పిలుస్తారు.
https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcR3u2TFoq8xCuvHwlqBwm-OxgIefTgORayMPw&usqp=CAU
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల కంటే ఇది చాలా తక్కువ నీటితో ఉంటుంది. Dead sea లోని నీరు సాధారణ సముద్రపు నీటి కంటే దాదాపు 10 రెట్లు ఉప్పగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 1,412 అడుగుల దిగువన ఉంది. ఈ హైపర్ సలైన్ సరస్సు 306 మీటర్ల లోతులో ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైనది. డెడ్ సీ నీటి సాంద్రత 1.240 kg/L గా ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ఈత కొట్టకండానే తేలియాడేలా చేస్తుంది.
https://www.worldatlas.com/r/w1300-q80/upload/8c/c0/b6/shutterstock-500854195.jpg
స్ఫటికాకార సోడియం క్లోరైడ్ ఉండటం వల్ల ఇక్కడ నీటి అంచున రాళ్లు, ఇసుక మెరుస్తాయి. ఈ సమయంలో, జూడియా కొండలు అలాగే జోర్డాన్ పర్వతాల మధ్య, టూరిస్ట్‌లు డెడ్ సీ ని ఆస్వాదిస్తు ఉంటారు. టూరిస్ట్‌లు స్నానం చెయ్యటానికి ముందుగా అక్కడ ఉన్న డెడ్ సీ మడ్ మాస్క్‌తో కప్పుకుంటారు. దీంతో వారి శరీరాలు ఆ బంకమట్టిలో ఉన్న హైలురోనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను గ్రహించేలా చేస్తాయి. డెడ్ సీ 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో దాని విశాలమైన భూ భాగంలో ఉంది. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఉంది. దీంతో అందులోకి చేరే మంచి నీటి ప్రవాహాలు చేరే అవకాశం లేదు. ప్రస్తుతం అక్కడ పడే వర్షాల కారణంగా, ప్రభుత్వం ప్రతేకంగా విడుదల చేసే నీటి ద్వారా అది రక్షించబడుతోంది.
https://static.toiimg.com/thumb/79608521.cms?resizemode=4&width=400