డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం… 25 మందికి గాయాలు

by Shyam |   ( Updated:2021-02-15 23:37:14.0  )
డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం… 25 మందికి గాయాలు
X

దిశ, రంగారెడ్డి: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళుతున్న ఓ డీసీఎం వ్యాన్ కొత్వాల్ గూడ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న 25 మంది కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed