- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వదేశీ తయారీ వాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో, పలు దేశాలు దీనికి వ్యాక్సిన్ కనుగొనే పనిలో నిమగ్నం అయ్యాయి. కరోనాకు సరైన వాక్సిన్ లేకపోవడమే ఈ విస్తృతవ్యాప్తి కారణం అని చెప్పొచ్చు. ఇక ప్రపంచంలో దాదాపుగా 100కు పైగా కంపెనీలు వాక్సిన్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా అనేక కంపెనీలు వాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తి స్వదేశీ న్యుమోకాకల్ పాలిసాకరైడ్ కంజుగేట్ వాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌తో ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇప్పటికే ఇచ్చింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దశల్లో ట్రయల్స్‌ను కంప్లీట్ చేసినట్టు కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా అటు గాంబియా దేశంలో కూడా దీనికి సంబంధించిన ట్రయల్స్‌ను పూర్తి చేసినట్టు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తెలిపింది.