పగటిపూట రోడ్డు విస్తరణ పనులు పరేషాన్లో విద్యార్థులు. ప్రయాణికులు.

by Shyam |
పగటిపూట రోడ్డు విస్తరణ పనులు పరేషాన్లో విద్యార్థులు. ప్రయాణికులు.
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జన సందోహంగా ఉండే బస్టాండ్ ముందు పరిసరాల ఏరియాలో కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులు చేయడం వల్ల ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీటన్నింటిని కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి ఉదయం సాయంత్రం మారుమూల గ్రామాల నుండి వచ్చే వారితో, విద్యార్థులతో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బస్టాండ్ ఆంజనేయస్వామి గుడి మధ్య భాగంలో జనసంద్రంగా ఉంటుంది. ఈ సమయంలో రోడ్డు విస్తరణ పనులు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఈ పనులను రాత్రిపూట కొనసాగించాలని పట్టణ ప్రజలు పలుమార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పగటి పూట పనులు చేయడం వల్ల ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులకు ప్రయాణాలకు పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఉత్సవాలు నాలుగైదు రోజుల్లో తిరునాళ్ళు ప్రారంభం కావడం సమయంలో రోడ్డు విస్తరణ పనులు చేయడం వల్ల రథోత్సవానికి వచ్చే భక్తులకు ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారుల చొరవ తీసుకుని రోడ్డు విస్తరణ పనులు రాత్రి సమయంలో చేస్తూ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story