- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఖరి నిమిషంలో గోల్.. మోహన్ బగాన్ అద్భుత విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి ఫర్టొడా స్టేడియంలో చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో గోల్ చేసిన ఏటీకే మోహన్‌బగాన్ క్లబ్ 1-0తో విజయం సాధించింది. టాస్ గెల్చిన మోహన్‌బగాన్ కెప్టెన్ రాయ్ కృష్ణ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించుకున్నాడు. 9వ నిమిషంలో చెన్నయిన్ ఆటగాడు రహీమ్ అలీ గోల్ పోస్టుపై దాడి చేసి విఫలమ్యాడు. ఇరుజట్లు మంచి పాస్‌లు ఇచ్చుకుంటూ గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. తొలి అర్దభాగం ముగిసినా ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.
రెండో అర్దభాగంలో మోహన్ బగాన్ బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉంచుకున్నది. కానీ గోల్ చేయడంలో మాత్రం విఫలమైంది. రెండో అర్దభాగం కూడా ముగిసిపోయిన తర్వాత రిఫరీ ఇంజ్యూరీ టైం కలిపాడు. ఆ సమయంలో మోహన్ బగాన్ ఆటగాడు డేవిడ్ విలియమ్స్ అద్భుతమైన గోల్ చేశాడు. చెన్నయిన్ డిఫెన్స్‌ను ఛేదించి జేవియర్ హెర్నాండెజ్ ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచాడు. అప్పటి వరకు మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నా.. ఆఖరి నిమిషంలో గోల్ చేసి మోహన్ బగాన్ జట్టు విజయాన్ని నమోదు చేసింది. జేవియర్ హెర్నాండెజ్‌కు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, డేవిడ్ విలియమ్స్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.