- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నర్ దూరం కావడానికి అసలు కారణం వేరే ఉందా?
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ తొలి వన్డేలో గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తొడకండరాల గాయంతో ఆటకు దూరమైన డేవిడ్ వార్నర్ గత కొన్ని రోజులుగా బయో సెక్యూర్ వాతావరణానికి బయట ప్రత్యేక వైద్యుల మధ్య కోలుకుంటున్నాడు. కాగా, ఇప్పటికే తొలి టెస్టుకు దూరమైన డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు ఆడేది అనుమానంగా మారింది. గాయం నుంచి కోలుకోలేకపోవడం వల్లే వార్నర్ బాక్సింగ్‌డే టెస్టుకు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే అసలు కారణం వేరే ఉందంటా. డేవిడ్ వార్నర్, అబాట్ సిడ్నీలోని బయో బబుల్ నుంచి బయటకు వచ్చి గాయం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తమ ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుంటున్నారు. వీళ్లు ఇప్పటికిప్పుడు ఫిట్‌నెస్ సాధించినా.. జట్టుతో చేరే అవకాశాలు లేవు. కోవిడ్ నిబంధనల ప్రకారం బయోబబుల్ నుంచి బయటకు వచ్చిన ఆటగాల్లు తప్పని సరిగా క్వారంటైన్‌లో ఉండాలి. కానీ బాక్సింగ్‌డే టెస్టుకు మరో రెండు రోజుల సమయమే ఉండటంతో వార్నర్, అబాట్ జట్టుతో చేరేందుకు అవకాశం లేదు. బయోసెక్యూర్ నిబంధనల మేరకే వార్నర్, అబాట్ రెండో టెస్టుకు దూరమవుతున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధృవీకరించింది. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని రెండో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.