కూతురి ప్రేమాయణం.. తండ్రిని పెట్రోల్ తో తగలబెట్టిన కూతురు

by Sumithra |   ( Updated:2021-01-10 02:33:19.0  )
కూతురి ప్రేమాయణం.. తండ్రిని పెట్రోల్ తో తగలబెట్టిన కూతురు
X

దిశ,వెబ్‌డెస్క్: తల్లి ఈ ప్రేమా దోమా మనకొద్దు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మన కుటుంబ పరువుపోతుంది. నేను బయట తలెత్తుకొని తిరగలేనంటూ తండ్రి కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన కూతురు, ఇతర కుటుంబ సభ్యులు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణంలో తండ్రి మరణించగా.., నిందితులు పరారయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని బోదాన్ జిల్లాకు చెందిన వాజిర్ గంజ్ హత్రా గ్రామంలో అమిర్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. అందులో పెద్ద కూతురు ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇదే విషయంపై తండ్రికి, కూతురికి మధ్య గత కొద్ది రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. అయితే ఎప్పటిలాగే ప్రేమ వ్యవహారంపై తండ్రీ -కూతురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తండ్రి తన ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదనే కోపంతో నిందితురాలు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి బాధితుడు అమిర్ పై పెట్రోల్ తో దాడి చేశారు ఈ దాడిలో బాధితుడు 30శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed