ప్రమాదకరంగా ఫ్లైఓవర్.. భయపడుతున్న వాహనదారులు

by Shyam |   ( Updated:2021-12-15 06:07:27.0  )
ప్రమాదకరంగా ఫ్లైఓవర్.. భయపడుతున్న వాహనదారులు
X

దిశ, మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతూ 2016 డిసెంబర్ 31న రూ. 250 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన గత కొన్ని నెలలుగా సిమెంట్ ఊడి, పెచ్చులు పైకి లేచి రాఫ్టర్లు బయటకి తేలి ప్రమాదకరంగా మారింది. గోతులు ఏర్పడి వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అయితే మోటారు సైకిల్, ఆటోవాలాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్‌హెచ్ అధికారుల పర్యవేక్షణ లేక నిర్లక్ష్యం కారణంగా వంతెన మరమ్మతులు చేయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story