- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ మూవీ సరికొత్త రికార్డు.. తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి..!

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది.
ఇదిలా ఉంటే.. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే 11 సార్లు వాయిదా పడిన సినిమాగా తిరుగులేని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటే మినిమమ్ ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ మూవీ మే9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కానీ మళ్లీ ఈ చిత్రం వాయిదా పడే చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మే 30 లేదా జూన్ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.