- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టుల కోసం కొనసాగుతోన్న వేట.. ఆ ప్రాంతాన్ని రౌండప్ చేసిన భద్రతా బలగాలు

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోగా.. కీలక ప్రాంతాల్లో వారు పట్టును కోల్పోయారు. ఈ క్రమంలోనే కొండగావ్ - నారాయణ్‌పూర్ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్పాట్ చేసుకుని వారి కోసం వేటను మొదలు పెట్టాయి. కొండగావ్ - నారాయణ్ పూర్ సరిహద్దు ప్రాంతంతో పాటు కిలాం-భార్గం అడవులను వారు జల్లెడ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున అదే కొండగావ్ - నారాయణపూర్ బార్డర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు కీలక మావోయిస్టు నేతల మృతదేహాలు లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ మేరకు స్పాట్‌లో ఏకే-47తో రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, మృతిచెందిన మావోయిస్టుల్లో ఒకరిపై రూ.8 లక్షలు, మరొకరిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఎదురుకాల్పల జరుగుతున్నప్పటికీ ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి.