రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత బంధు పెట్టండి : బండి సంజ‌య్

by Shyam |
sanjoy
X

దిశ, గండిపేట్ :‍ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇత‌ర మ‌తాల‌ను గౌర‌విస్తూ హిందూ మ‌తానికి ప్రాధాన్యత ఇస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. పాతబ‌స్తీలో ఎంఐఎం ప్రాబ‌ల్యం రోజురోజుకు త‌గ్గుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడ‌వ రోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని ఆరె మైస‌మ్మ దేవాల‌యం వ‌ర‌కు చేరుకుంది. అంబేడ్కర్ విగ్రహానికి పూల‌మాల‌లు వేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగించారు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిప‌డ్డారు.

bs

రాబోయే ఎన్నిక‌ల్లో రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ద‌ళితుల భూములను లాక్కొని వారిని రోడ్డున ప‌డేసిన ఘ‌న‌త ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక చార్మినార్ పేరును భాగ్యన‌గ‌రంగా, గోల్కొండ పేరును గొల్లకొండ‌గా మారుస్తామ‌ని వివ‌రించారు. ఉద్యమ స‌మ‌యంలో నిజాంను దుమ్మెత్తి పోసిన కేసీఆర్ నేడు నిజాంను నెత్తిన ఎక్కించుకున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1400 మంది ఆత్మబ‌లిదానాలు చేసుకుంటే రాష్ట్రం సిద్ధించింద‌ని, ఇందులో కేసీఆర్ చేసిందేమీ లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ క‌బంధ హ‌స్తాల్లో ఉంద‌ని, వారి చేతుల్లో నుంచి రాష్ట్రానికి విముక్తి క‌లిగించ‌డ‌మే బీజేపీ ప్రధాన ల‌క్ష్యమ‌న్నారు.

అందులో భాగంగా 2023 లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ద‌ళిత బంధునుఅమ‌లు చేయాల‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత‌బంధును అమ‌లు చేస్తామంటే తాను రాజీనామాకైనా సిద్ధమ‌ని స‌వాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు న‌ర్సింహ్మారెడ్డి, శాస‌న‌మండ‌లి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్‌, బీసీ క‌మిష‌న్ స‌భ్యులు ఆచారి, మ‌నోహ‌ర్‌రెడ్డి, బీజేఎంసీ అధ్యక్షుడు మ‌హేష్ యాద‌వ్‌, జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి, అర్చన‌, సంగీత‌, బీజేఎంసీ కార్పొరేట‌ర్లు బుర్ర భూపాల్‌గౌడ్‌, ప్రశాంత్‌నాయ‌క్‌, నాయ‌కులు మ‌ల్లారెడ్డి, బండ న‌రేష్ యాద‌వ్‌, చ‌ర‌ణ్‌, దుద్దాల ల‌క్ష్మినారాయ‌ణ‌, నార్సింగి బీజేపీ అధ్యక్షుడు చిక్కిరి భిక్షప‌తి యాద‌వ్‌, కౌన్సిల‌ర్ ఆదిత్యారెడ్డి, ప‌ద్మ వీరారెడ్డి, నాయ‌కులు మొండె నాగేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed