యూపీలో కూలీలకు రోజుకు రూ. 1000 సాయం

by Shamantha N |   ( Updated:2020-03-21 00:32:19.0  )
యూపీలో కూలీలకు రోజుకు రూ. 1000 సాయం
X

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా సామాజిక దూరాన్ని పాటించాలని, గుమిగూడొద్దని సీఎం యోగి ఆదిత్యానాథ్ సూచించారు. అలాగే, కూలీలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. నిర్మాణరంగంలోని 20.37లక్షల కూలీలకు రోజుకు రూ. 1000 అందజేయనున్నట్టు వెల్లడించారు. కార్మిక శాఖ సహాయంతో ఈ నగదును అందిస్తారు. అలాగే, 15 లక్షల మంది రోజువారీ కూలీలకూ రూ. 1000 సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. మనదేశంలో కరోనా వైరస్ కేసులు 270కి చేరగా.. నలుగురు మరణించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రధాని సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రకటిస్తున్నారు. కేరళ సీఎం విజయన్ కూడా ఇళ్లు కదలొద్దని చెబతూ ఆర్థికంగా ఆదుకునే చర్యలు తీసుకున్నారు. తాజాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచనల ప్రకటన చేశారు.

Tags: UP CM, yogi adityanath, financial aid, support, rs 1000, labours

Advertisement

Next Story

Most Viewed