- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురువారం పంచాంగం, రాశిఫలాలు (10-06-2021)
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య(నిన్న మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 20 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి (నిన్న ఉదయం 8 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 43 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : నాగ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 54 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : వృషభము
మేష రాశి : వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ ల లో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలను తెస్తాయి. ఆదాయం ను మించిన ఖర్చులు. సంఘంలో తగిన మర్యాద లభిస్తుంది. ఆఫీసులో పెండింగ్ పనులన్నీ అతి కష్టం తో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ తల్లి గారి ఆరోగ్యం కొరకు ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్యలో కి మీ బంధువులు వస్తున్నారు జాగ్రత్త.
వృషభ రాశి : ఆధ్యాత్మిక విషయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. దైవ ప్రార్ధన వలన లాభం. సహనమే మీ విజయానికి సూత్రం. ఆఫీసు పనులలో తోటి ఉద్యోగుల సలహాలు తీసుకోండి. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. కొంతమందికి ప్రయాణాలు. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. ఆదాయం బాగున్నా కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. నగలు, నూతన వస్త్రాలు కొంటారు. గొంతు నొప్పి మిమ్మల్ని బాధించవచ్చు. వ్యాపారంలో లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో గొడవలు సర్దుకుంటాయి.
మిథున రాశి : ముఖ్య నిర్ణయం చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. తప్పుడు నిర్ణయం వల్ల అవతల వారి నుంచి మీకు మాటలు మీకు మనశ్శాంతి కరవు. వాదోపవాదాలకు దిగకండి. ఆఫీసులో పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. వ్యాపారస్థులకు లాభాలు మరియు పాతబాకీలు తీర్చి వేస్తారు. కుటుంబ వ్యవహారాల మీద భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు.మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
సింహరాశి : ఈరోజు మీరు అనుకున్న కార్యాలను సాధిస్తారు. మిత్రుల మరియు బంధువుల సహకారం లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలను తెస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల వలన పెద్దగా లాభం లేదు. ఆర్థికంగా బాగుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కొంతమంది స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
కర్కాటక రాశి : ఈరోజు మీరు అనుకున్న కార్యాలను సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడటం వలన అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనిలో మీ పని సామర్థ్యం పట్ల పై అధికారుల ప్రశంసలు. మీ తోటి ఉద్యోగులు ఈర్ష్య పడతారు. ఆదాయం బాగుంది సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.ఫిట్ నెస్ కొరకై మీరు చేస్తున్న యోగా మెడిటేషన్ వల్ల లాభం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు అన్ని విషయాలలో అండగా ఉంటారు.
కన్య రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కొంతమంది ఇంటికి పాప /బాబు రాబోతున్నారు వారికి పేర్లు వెతకండి. ఆదాయం బాగుంది. ఇంటి కొనుగోలు కు లేక మరమ్మతులకు డబ్బు ఖర్చు చేస్తారు. కొంతమందికి వంశపారంపర్యంగా రావలసిన ఆస్తి దక్కుతుంది. ఆఫీసు పనులను పూర్తి చేయటానికి మీ తెలివితేటలు సామర్థ్యము, ఎక్కువ సమయము ఉపయోగించాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త అన్ని పనులలో సహకరించడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
తులారాశి : మీ సహనమే విజయాన్ని సూత్రం. మీ బరువును చెక్ చేసుకోవలసిన సమయం వచ్చింది. కొంతమందికి ఎలర్జీ వలన అనారోగ్య సమస్య. ధన సంపాదనకు కొత్త పథకాల్లో పెట్టుబడులు పెట్టబోయే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆదాయం బాగున్నా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు వలన పెద్దగా లాభం లేదు. దైవ ప్రార్ధన వలన అడ్డంకులు తొలగిపోతాయి. ఆఫీసు పనులు ఆశించినంత మేరకు పూర్తి కావు ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక విషయాలు మీకు సంతోషాన్ని, మానసిక బలాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఆఫీస్ పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంది. పొదుపు చేస్తారు. ధన సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. శుభవార్త వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఫిట్ నెస్ కొరకై మీరు చేస్తున్న ఈ యోగా మెడిటేషన్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
మకర రాశి : అనుకున్న కార్యాలను చిన్న ఇబ్బందులు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆదాయం బాగుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. అనవసరపు దుబారా ఖర్చులను నియంత్రించండి. అనవసరపు భయాందోళనలను వదిలివేయండి.సరైన ప్రణాళికల వలన విజయం తథ్యం. ఆఫీసు పనులను హడావుడి లేకుండా తప్పులు జరగకుండా పూర్తి చేయటానికి ప్రయత్నించండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.
ధనస్సు రాశి : మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తారు. సరైన కమ్యూనికేషన్ మీ బలం. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు నూతన పథకాలను ప్రారంభించడానికి మంచి రోజు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పని పట్ల నిబద్దత మీకు ఆఫీసులో మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఫిట్ నెస్ కొరకై మీరు చేస్తున్న యోగా మెడిటేషన్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.
కుంభరాశి : హడావిడి గందరగోళం వదిలేయండి. దానివలన లేనిపోని భయాలు నిదానంగా ఆలోచించి అనుకున్న కార్యాలను పూర్తి చేయండి. ఆదాయం బాగుంది. దాన ధర్మాల వలన మీకు దైవ బలం తోడవుతుంది. కుటుంబ వ్యవహారాలలో భార్యను తప్పుపట్టడం వలన మనశ్శాంతి కరవు. ఆఫీసు పనులు తోటి ఉద్యోగుల సహాయంతో పనులు పూర్తి చేయండి. పనులు పెండింగ్ పెడితే పై అధికారులతో మాటలు. విద్యార్థులు టీవీ, మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టాలి. లేకుంటే సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మొరటుతనం మిమ్మల్ని బాధిస్తుంది.
మీన రాశి : నిరాశావాద ధోరణిని వదిలివేయండి. దానివలన లేనిపోని భయాలు నిదానంగా ఆలోచించి అనుకున్న కార్యాలను పూర్తి చేయండి. దైవబలం మీకు తోడు ఉంది. నిరుద్యోగులకు శుభవార్త. ఆఫీస్ పనులను సరైన ప్రణాళికతో చేయండి. తప్పులు జరిగితే పై అధికారులతో మాటలు. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. యోగా మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.