- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా.. వాడితే జాగ్రత్త పడాల్సిందే!
దిశ, తాండూరు: ఒకప్పుడు కత్తులు చూపి, తలుపులు పగలగొట్టి సొమ్మును దోచుకెళ్లేవారు. కొంతకాలం తర్వాత కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేవారు. అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పటిలా కాకుండా టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల సేకరించి డబ్బులు కొల్లగొడుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల ప్రపంచం కామన్ మ్యాన్‌కు దగ్గరైంది. దీంతో ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. అన్ని పనులను సెల్‌ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలకు ప్రతిఒక్కరూ దగ్గరయ్యారు. అయితే దీనినే సైబర్ నేరగాళ్లు అదునుగా భావించి అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్న విధానంపై ‘దిశ’ కథనం మీకోసం..
ఫేస్‌బుక్‌తో పరేషాన్..
అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అందులో ఈ ఫేక్ ఫేస్‌బుక్ ఒకటి. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, బ్యాంకింగ్, అధికారులను గత కొంతకాలంగా ఫాలో అవుతూ వారిపైనే కొత్త ఫేక్ ఖాతాలు తెరుస్తున్నారు. అప్పటికే వారికున్న స్నేహితులకు, బంధువులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అయితే రెండు మూడు రోజులు ‘హలో’, ‘హాయ్, అంటూ పలరింపులు చేస్తున్నారు. ఆ తర్వాత అత్యవసరముందని, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బులు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తూ డబ్బులు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడే సామాన్యులు పప్పులో కాలేసినట్టు. వాస్తవానికి మనకు తెలిసిన వ్యక్తులపైనే ఖాతాలు తెరుస్తున్నారు. కాబట్టి తెలిసిన వ్యక్తి అని సదరు పేరు మీద వచ్చిన ఫేస్‌బుక్ మెసేజ్ ఆధారంగా డబ్బులు వేస్తున్నారు. తీర మరో రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరితే నాకేప్పుడు ఇచ్చావ్ అంటూ స్నేహితుల మధ్య జరిగిన గొడవలు కోకొల్లలు. తెలిసిన వారి పేరు మీద ఖాతాలు తెరుస్తు మోసం చేస్తున్న వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మనవారే అని నమ్మి మోసపోవద్దు
తెలిసిన వారి పైన నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరవడం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సేక్టర్ల, రాజకీయ నాయకులనే లక్ష్యంగా చేసుకొని నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. ఈ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల ద్వారానే నాకు డబ్బులు అత్యవసరం ఉన్నాయి. ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మనకు తెలిసిన వారే కదా అంటూ కొంతమంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబ్బులు వేస్తూ మోసపోతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి : సీఐ జలంధర్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించి సామాన్యులను మోసం చేస్తున్నారు. ఈ విషయం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. అవగాహన లేని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తెలిసిన వారి మాదిరిగా ఎవరైనా మెస్సేంజర్, ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు అడిగితే అసలైన వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలి. ఎవరు కూడా ఫేస్‌బుక్ ద్వారా డబ్బులను అడగరు. ఈ విషయం పట్ల సామాన్యులు సైతం అలర్ట్‌గా ఉండాలి.