ఫేక్ పేటీఎం.. ఫేక్ గూగుల్ పే.. 8 మంది అరెస్టు

by Sumithra |
ఫేక్ పేటీఎం.. ఫేక్ గూగుల్ పే.. 8 మంది అరెస్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి, ఒరిజినల్ అకౌంట్ హోల్డర్ పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతూ.. నయా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఏకంగా గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రసిద్ధి గాంచిన మనీ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ల లాగానే ఉండే పేర్లతో ఫేక్ లావాదేవీలతో మోసాలకు దిగుతున్నారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్‌లో ఫేక్ గూగుల్ పే, ఫేక్ పీటీఎంల పేరుతో షాపింగ్ నిర్వహించి మోసగించిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సౌత్ జోన్ పరిధి కంచన్ బాగ్‌లో ఓ దుకాణంలో సుమారు రూ.28 వేల విలువ చేసే 22 ట్రజర్స్, 20 షర్ట్ లను, చంద్రాయణగుట్టలో రూ.8,500లు విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్, రూ.10,700లు విలువ చేసే నిత్యావసర సరుకులు, మీర్ చౌక్‌లో రూ.28 వేలు విలువ చేసే గోల్డ్ రింగ్‌లను కొనుగోలు చేసినట్టుగా నటించి, పేఏటీఎం ద్వారా ట్రాన్స్ ఫర్ అయినట్టుగా చూపించి మోసగించారు.

వీరిపై కంచన్ బాగ్, చంద్రాయణగుట్ట, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందగా, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులు ముస్తఫా హుస్సేన్(20), ఆమీర్ హస్సన్(24), ఇలియాస్(25), వాజీద్(27), హఫీజ్ రానా(23), సల్మాన్(20), అబ్దుల్ షాహెద్(22), యూసుఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గుమ్మి చక్రవర్తి, ఏసీపీ మాజీద్ ఇన్ స్పెక్టర్లు కోటయ్య, ప్రసాద్ వర్మ, రాఘవేంద్రలను సీపీ అంజనీకుమార్ అభినందించారు. అప్లికేషన్ల ద్వారా మనీ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులు కచ్ఛితంగా తమ మొబైల్ నెంబరు‌ను ఎస్ఎంఎస్ అలర్ట్‌ను బ్యాంక్ లింకేజ్ చేయించుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed